జెర్సీ రన్ టైం లాక్ !

Published on Apr 17, 2019 8:23 am IST

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నాని నటించిన జెర్సీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం 160 నిమిషాల నిడివి తో ఈనెల 19 న ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను రాబట్టి సినిమా ఫై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం లో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మి నిర్మించింది. మరి నాని ఈ చిత్రం తో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :