జెర్సీ ట్రైలర్ ,ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు !

Published on Apr 9, 2019 10:02 am IST

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న జెర్సీ విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 12న ఉదయం 9గంటలకు విడుదలచేయగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 15న నిర్వహించనున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 19న తెలుగు తో పాటు హిందీ లోనూ విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :