ఓటీటీలోకి వచ్చేసిన ‘జిగ్రీస్’.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా?

Jigris

యూత్‌ఫుల్ కామెడీ డ్రామాగా రూపొందిన ‘జిగ్రీస్’ (Jigris) సినిమా యాక్టర్స్ లేదా టెక్నీషియన్స్ కంటే ఎక్కువగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సపోర్ట్‌తోనే ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. ట్రైలర్‌ను లాంచ్ చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకావడం ద్వారా వంగా ఈ చిత్రానికి బలమైన సపోర్ట్ అందించారు. కృష్ణ బురుగుల, మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్, మణి వాకా, ధీరజ్ ఆత్రేయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సన్ నెక్స్ట్ వేదికగా జనవరి 6 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సాధించిన రెస్పాన్స్‌తో పోలిస్తే, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమాకు మెరుగైన ఆదరణ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

‘జిగ్రీస్’ (Jigris) చిత్రంతో హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి ఈ సినిమాను నిర్మించారు. సయీద్ కమ్రాన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా, ఓటీటీ విడుదలతో ఈ చిత్రానికి కొత్త ఊపిరి లభిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

Exit mobile version