బంపర్ రేటు పలికిన ‘జిల్’ శాటిలైట్ రైట్స్

బంపర్ రేటు పలికిన ‘జిల్’ శాటిలైట్ రైట్స్

Published on Apr 9, 2015 11:30 AM IST

Jil
‘సాహసం’, ‘లౌక్యం’ల తర్వాత ‘జిల్’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న మాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాడు. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. గోపీచంద్ ఫైర్ ఆఫీసర్ గా కనిపించిన ఈ సినిమాలో గోపీచంద్ ఎన్నడూ లేనంత స్టైలిష్ గా కనిపించాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారు నిర్మించారు.

తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం జరిగిన పోటీలో ఓ ప్రముఖ చానల్ 4.75 కోట్లకి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. గోపీచంద్ సినిమాకి ఇంత మంచి రేటు రావడంతో యువి క్రియేషన్స్ వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ సినిమా తర్వాత ‘జిల్’ సినిమాతో యువి క్రియేషన్స్ వారు కూడా హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాకి గిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు