లవ కుమార్ ను చూసి ఆశ్చర్యపోతారట !


ఎన్టీఆర్ చిత్రం ‘జై లవ కుశ’ కొత్త టీజర్ రేపు సాయంత్రం 5 గంటల 40 నిముషాలకు రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనుండగా అందులో ఒకటైన జై పాత్ర యొక్క టీజర్ గతంలో విడుదలై విశేషాదరణ పొందింది. దీంతో రెండవ పాత్ర ‘లవ కుమార్’ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

చిత్ర టీమ్ చెబుతున్న దాని ప్రకారం జై పాత్ర వైల్డ్ గా ఉంటే లవ కుమార్ మాత్రం సౌమ్యుడిగా కనిపిస్తాడని, ఆ పాత్ర కథతో పాటు నడుస్తుందని, అంతేగాక ఇందులో తారక్ చూపిన నటనలోని వేరియేషన్ ఆకట్టుకుంటుందని మొత్తం మీద టీజర్ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందని తెలుస్తోంది. మరి టీమ్ చెప్తున్నట్లు అంతలా ఆశ్చర్యపరిచే కంటెంట్ టీజర్లో ఏముంటుందో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. బాబాయ్ దర్శకత్వంలో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్తేమ్బర్ 21న రిలీజ్ చేయనున్నారు.