ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ తో వచ్చిన ‘జోడి’ !

ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ తో వచ్చిన ‘జోడి’ !

Published on Apr 6, 2019 3:13 PM IST

ఆది సాయికుమార్ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా ‘జోడి’ అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన జోడి ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది. హీరోయిన్ ను దగ్గరగా తీసుకుంటున్నట్టుగా ఆది ఉండగా.. అతన్నే ప్రేమగా చూస్తున్నట్టుగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ కనిపిస్తోంది.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆహ్లాదంగా ఉన్నట్టుగా ప్రశంసలు వస్తున్నాయి.

ఇక గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జోడీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా
విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ వి.కే. నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ‘నీవే’ ఫణికళ్యాణ్, సినిమాటోగ్రఫీ : ఎస్.వి. విశ్వేశ్వర్, ఎడిటర్ : రవి మండ్ల, మాటలు : త్యాగరాజు(త్యాగు), నిర్మాతలు : పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం, దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు