ఎన్టీఆర్, నీల్ టైటిల్, ఫస్ట్ లుక్ ఆరోజే!?

ఎన్టీఆర్, నీల్ టైటిల్, ఫస్ట్ లుక్ ఆరోజే!?

Published on Apr 19, 2025 11:05 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు చేస్తున్న చిత్రాల్లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో 29వ చిత్రంగా చేస్తుండగా ఈ సినిమా కోసం అభిమానులు అనౌన్సమెంట్ చేసిన రోజు నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.

అయితే ఎన్టీఆర్ లేని సన్నివేశాలతో నీల్ స్టార్ట్ చేయగా కొన్ని రోజుల్లో తారక్ కూడా సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు. మరి గతంలో సలార్ తరహా లోనే షూటింగ్ స్టార్ట్ చేసిన తక్కువ సమయంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇచ్చేసినట్టు ఇపుడు కూడా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ పోస్టర్ ని అందించనున్నట్టుగా తెలుస్తుంది. ఇలా రానున్న మే నెలలో తారక్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ సహా టైటిల్ కూడా రిలీజ్ ఆరోజే ఉంటుందని తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు