ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న చరణ్, ఎన్టీఆర్ ల ఫన్నీయెస్ట్ వీడియో.!

Published on Dec 11, 2021 5:16 pm IST


ప్రస్తుతం పాన్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రౌద్రం రణం రుధిరం” సినిమా చిత్ర యూనిట్ అంతా కూడా సాలిడ్ ప్రమోషన్స్ ని చేస్తూ బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్క రోజులోనే మూడు ప్రాంతాల్లో ఇంటర్వూస్ ఇచ్చారు. ఇక ఈరోజు తెలుగు కి సంబంధించి హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు.

అయితే ఇదిలా ఉండగా ఈరోజు ఇంటర్వ్యూ లో మాత్రం చాలా ఫన్నీ మూమెంట్స్ కనిపించాయి. ముఖ్యంగా రాజమౌళి తన ఇద్దరు హీరోలు చరణ్, ఎన్టీఆర్ కు సెట్స్ లో చేసిన అల్లరి కోసం చెప్పడం ది బెస్ట్ మూమెంట్ గా మారింది. అయితే అదే నిజం చేస్తూ మొత్తం ఇంటర్వ్యూ అయ్యాక ఇద్దరు హీరోలు ప్రెస్ ఫోటో లకి గాను పోజ్ ఇస్తుండగా..

మళ్ళీ చరణ్ వెనుక నుంచి ఎన్టీఆర్ ని చిన్నగా గిల్లాగా ఒక్కసారే ఎన్టీఆర్ ఉలిక్కి పడ్డాడు. ఇదంతా జస్ట్ 3 సెకండ్స్ లో అయ్యిపోయింది. దీనితో ఇది చూసిన వారంతా ఒక లెక్కలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోనే ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :