మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం మన దగ్గర సహా యూఎస్ మార్కెట్ లో రికార్డు వసూళ్లు ఈ చిత్రం అందుకొని అదరగొట్టింది. ఇక ఈ సెన్సేషనల్ రన్ తర్వాత ఇటీవల జపాన్ దేశంలో కూడా మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకెళ్లారు.
అయితే జపాన్ లో కూడా దేవర మన దగ్గర నడిచినట్టే సాలిడ్ రన్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. అక్కడ విజయవంతంగా 3 వారాల రన్ ని కంప్లీట్ చేసుకొని నాలుగో వారంలోకి ఎంటర్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో అక్కడ కూడా దేవర మంచు సక్సెస్ సాధించింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు. అలాగే అతి త్వరలోనే ఈ చిత్రంకి సీక్వెల్ ని కూడా మేకర్స్ స్టార్ట్ చేయనున్నారు.
.
┏━┓┏━┓┏━┓
┃4┃┃週┃┃目┃ 突入!
┗━┛┗━┛┗━┛いつも応援ありがとうございます✨
デーヴァラとバイラのアツい戦闘シーン????????
映画『#デーヴァラ』絶賛公開中???? pic.twitter.com/9TDuUDFIoX
— 【公式】映画『デーヴァラ』 (@devaramovie_jp) April 18, 2025