ఈ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్న తారక్ ఫ్యాన్స్.!

Published on May 16, 2021 9:38 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం కూడా సాలిడ్ లైనప్ ను కూడా తారక్ సెట్ చేసాడు. అయితే ఇప్పుడు తారక్ అభిమానులు మాత్రం ఒక అనౌన్సమెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

“RRR” లో తారక్ చేస్తున్న పవర్ ఫుల్ రోల్ కొమురం భీం సరికొత్త పోస్టర్ ను తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చెయ్యడం కన్ఫర్మ్ అని తెలిసిందే. కానీ మరోపక్క తారక్ కోవిడ్ బారిన కూడా పడ్డాడు. దీనితో ఈ సందర్భంలో చిత్ర యూనిట్ యూనిట్ నుంచి ఒక అధికారిక కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.

అంటే పోస్టర్ వస్తుందా లేదా అన్న దానిపై ముందే ఒక అనౌన్సమెంట్ ఇస్తారుగా దాని కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా నాలుగు రోజులే సమయం ఉన్నందున వారిలో టెన్షన్ మరింత ఎక్కువయింది. మరి మేకర్స్ ఆ అనౌన్సమెంట్ ఇస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :