ఎన్టీఆర్‌ చెంపలు వాయించేసిన అభయ్ రామ్ !

ntr son
జూ ఎన్టీఆర్‌ చెంపలను వాయించేసాడు ఓ పిల్లాడు. కాకపొతే ఆ పిల్లాడు ఆయన పెద్ద కుమారుడు అభయ్‌ రామే. అభయ్‌ చేసే అల్లరి పనులను ఎన్టీఆర్ అప్పుడప్పుడు సోషల్‌మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటారు. కాగా తాజాగా అభయ్ కి తనకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘నా పెద్ద కుమారుడికి నేను పంచింగ్‌ బ్యాగ్‌ అయిన వేళ..’ అని సరదాగా క్యాప్షన్‌ తో పాటు కరాటే కిడ్‌ అన్న హ్యాష్‌ట్యాగ్‌ ను కూడా పెట్టారు. ఇక ఇటీవల జూ ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు రెండో కుమారుడు భార్గవ్‌ రామ్‌ జన్మించిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటికే విడుదలైన అరవింద సమేత టీజర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Exit mobile version