కళ్యాణ్ హిస్టారికల్ మూవీ కోసం తారక్..?

Published on Jun 11, 2021 7:01 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీనితో పాటుగా మన టాలీవుడ్ లో మరిన్ని పీరియాడిక్ చిత్రాలు వస్తున్నాయి. అయితే వాటిలో యంగ్ టైగర్ సోదరుడు కళ్యాణ్ రామ్ సడెన్ హిస్టారికల్ చిత్రం “బింబిసారా” కూడా ఒకటి.

ఊహించని విధంగా సాలిడ్ కాన్సెప్ట్ తో ప్లాన్ చేసిన దర్శకుడు వశిష్ట్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రంపై ఇప్పుడు క్రేజీ బజ్ ఒకటి వినిపిస్తుంది. ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోదరుని కోసం ఈ చిత్రానికి తన పవర్ఫుల్ వాయిస్ ఓవర్ ను ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తారక్ వాయిస్ ఓవర్ కు యూనానిమాస్ రెస్పాన్స్ ఉంది. మరి ఈ బజ్ కూడా నిజం అయితే మాత్రం ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ ఈ చిత్రానికి ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత సమాచారం :