ఎన్టీఆర్ ఆడియో వేడుకలో జూ ఎన్టీఆర్ !

Published on Dec 20, 2018 6:16 pm IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్ టి ఆర్’. కాగా మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ ఆడియో వేడుక డిసెంబర్ 21న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరుగనుందని తెలిసిందే.

కాగా ఈ ఆడియో ఈవెంట్ కి సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటుగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరుకానున్నారు. అలాగే ప్రత్యేక అతిధిలుగా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, జమున, గీతాంజలి వంటి అప్పటి స్టార్స్ కూడా ఈ వేడుకకు ప్రత్యేక అతిధిలుగా రానున్నారు.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్, వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :