లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమాపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయడం తనకెంతో గౌరవంగా భావిస్తున్నట్లు తారక్ పేర్కొన్నాడు.
‘సింగీతం ఒక అందమైన చిత్రం, ఇది నా గుండెను హత్తుకుంది’ అని తారక్ ట్వీట్ చేశాడు. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు గారు చూపించిన సృజనాత్మకత, జ్ఞానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడాడు. ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ప్రతి సీన్లోనూ మ్యాజిక్ క్రియేట్ చేశాడని ప్రశంసించాడు. అలాగే, ఒక మహోన్నత దర్శకుడి 40 ఏళ్ల నాటి కలని సాకారం చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ టీమ్‌ను అభినందిస్తూ ఒక లెజెండ్‌కు ఇచ్చిన ఈ నివాళి అద్భుతమంటూ తారక్ పేర్కొన్నాడు.
ఇక సింగీతం గారి సినిమాల తరహాలోనే ఈ చిత్రబృందం కూడా ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసిందని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు ట్రైలర్ వస్తుంది, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ట్రైలర్ విడుదల చేయడం అస్సలు ఊహించలేదని, ఈ సర్ప్రైజ్ తనకు బాగా నచ్చిందని తారక్ చెప్పుకొచ్చాడు. ఈ అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూసి ఆస్వాదించాలంటూ తారక్ ఈ సందర్భంగా కోరాడు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


