పిక్ టాక్ : అఖిల్ అక్కినేని ‘లెనిన్’ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

పిక్ టాక్ : అఖిల్ అక్కినేని ‘లెనిన్’ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

Published on Jul 6, 2026 6:00 PM IST

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లెనిన్’ నుండి చిత్ర యూనిట్ ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. లెనిన్ చిత్ర ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఒక పవర్‌ఫుల్ వాయిస్ తోడైందని.. టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ ఎన్టీఆర్ ఈ సినిమాకు తన వాయిస్ ఓవర్ అందిస్తున్నాడని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలో జూ ఎన్టీఆర్‌ను హీరో అఖిల్ కలిసిన ఫోటోలు, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందిస్తున్న ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో కీలకమైన ‘శ్రీరామపురం’, ‘భారతం మిట్ట’ అనే ప్రాంతాలను మరియు సినిమా కథా నేపథ్యాన్ని ఎన్టీఆర్ తన గంభీరమైన వాయిస్ ఓవర్‌తో సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు.

ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో వాయిస్ తోడవడంతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు