ఆయన లేకపోవడం అతి పెద్ద లోటు – జూ ఎన్టీఆర్

Published on May 22, 2021 8:00 am IST

నిన్న రాత్రి మన టాలీవుడ్ కి చెందిన ప్రముఖ పి ఆర్ ఓ మరియు నిర్మాత అయినటువంటి బి ఏ రాజు గారు ఆకస్మిక గుండెపోటు రావడంతో మరణించిన సంగతి దీనితో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. మరి తాజాగా ఈ వార్త విన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నివాళులు అర్పించి రాజు గారితో తనకున్న పరిచయాన్ని పంచుకున్నారు.

ఆయన ఆకస్మిక మరణం తనని షాక్ కు గురి చేసింది అని ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా మరియు పి ఆర్ ఓ గా సినిమా ఇండస్ట్రీకి చాలా చేసారని, అలాగే ఆయన తన కెరీర్ ఆరంభం రోజులు నుంచే తెలుసనీ అలాంటి వ్యక్తి ఇపుడు లేకపోవడం అతి పెద్ద లోటు అని విచారం వ్యక్తం చేసి వారి కుటుంబం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

సంబంధిత సమాచారం :