ఇది సంబరాలు చేసుకునే సమయం కాదు – తారక్ విన్నపం

ఇది సంబరాలు చేసుకునే సమయం కాదు – తారక్ విన్నపం

Published on May 19, 2021 10:17 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్న తారక్ తన అభిమానులకు ఒక విన్నపం విన్నవించారు. రేపు మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మరి అలాగే ఆఫ్ లైన్ లో కూడా భారీ ఎత్తున తారక్ పుట్టినరోజును జరపాలని ప్లాన్ చేస్తున్నారు.

మరి వారి అందరి ఆరోగ్యం కోసం తారక్ ఒక ప్రెస్ నోట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. అభిమానులు పంపుతున్న సందేశాలు, వీడియోలు అన్ని చూస్తున్నాని మీ అందరి ఆశీస్సులు తనకి ఎంతో ఊరట కలిగించాయని తెలిపారు. అంతే కాకుండా తాను కోవిడ్ ని జయిస్తానని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా లాక్ డౌన్, కర్ఫ్యూ లను పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు.

తన పుట్టినరోజును ఉద్దేశించి ప్రతి ఏటా ఎలా సెలెబ్రేట్ చేస్తారో తెలుసనీ కానీ ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని దేశం అంతా కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తుందని అందుచేత ప్రతీ ఒక్కరు ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా వైద్యులకు బాలసటగా నిలిచి ఎందరో ప్రాణాలు, జీవనోపాధి కుదిరితే వారికి అండగా నిలబడాలని తారక్ తన అభిమానులకు సూచించారు.

అలాగే ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలని జాగ్రత్తగా చూసుకొని మాస్క్ ధరించి, కరోనాను సమూలంగా జయించిన రోజున మనమంతా కలిసి వేడుక చేసుకుందాం అని తారక్ తన అభిమానులకు సందేశాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు