హృదయానికి హత్తుకుపోతున్న ‘ఎన్టీఆర్’ పాట !

Published on Sep 19, 2018 5:49 pm IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజీకి తగ్గట్లుగా తెరకెక్కుతున్న పూర్తి యాక్షన్ చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రం రెండో సాంగ్ ‘పెన్విటీ’ లిరికల్ వీడియో సాంగ్ కూడా ఈ సాయంత్రం విడుదల అయింది. సాంగ్ ఎమోషనల్ గా సాగడంతో ఎన్టీఆర్ అభిమానులకు విపరీతంగా నచ్చుతుంది. తారక్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా ఈ సాంగ్ బాగా అలరిస్తోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.

అయితే ఈ ‘పెన్విటీ’ సాంగ్, ఓ ఇల్లాలు తన భర్త కోసం ఎదురుచూస్తూ.. మనసులో తన భర్తని ఉద్దేశించి పాడుకున్న కన్నీటి భావేద్వేగమైన పాటలా కొనసాగుతుంది. అదికాక రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. అక్కడి వాతావరణంతో పాటు, ఆ ప్రాంతపు కట్టుబాట్లు, వ్యవహారపు అలవాట్లు.. ఇలా ఇవన్నీ ఈ సాంగ్ లో కొన్ని షాట్స్ రూపంలో చూపించబోతున్నట్లు అర్ధమవుతుంది. అందుకే ఈ పాట ఈ చిత్ర కథనంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందట.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో కూడా సెప్టెంబర్ 20న నేరుగా మార్కెట్లోకి విడుదల అవ్వనుంది. అయితే చిత్ర విడుదలకు ముందు, విడుదల కార్యక్రమం ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :