మరో దిమ్మతిరిగే మల్టీ స్టారర్ లో తారక్..?

Published on Apr 18, 2021 10:00 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో మరో బిగ్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మన తెలుగులో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్స్ లో ఇది ఒకటి. మరి ఇదిలా ఉండగా మరో మన దక్షిణాది నుంచి దిమ్మతిరిగే మరో మల్టీ స్టారర్ రాబోతుంది అని గాసిప్స్ మొదలయ్యాయి.

మరి దానికి సంబంధించి యంగ్ టైగర్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో థలపతి విజయ్ లతో అక్కడి స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తాడని ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ లో మంచి హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ చిత్రం నిజంగా ఉందో లేదో అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికి అయితే తారక్ మరియు విజయ్ లు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :