‘బింబిసార’కు ఎన్టీఆర్ గాత్రం ?

Published on Jun 12, 2021 9:05 pm IST

జూనియర్ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్ కి ఓ ప్రత్యేకత ఉంది. తన గొంతుతో ఒక పాత్రలోని ఎన్నో వేరియేషన్స్‌ ను సింగిల్ డైలాగ్ లో పలికించగలడు తారక్. అయితే తాజాగా తారక్ తన సోదరుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటిస్తున్న ‘బింబిసార’ చిత్రం కోసం తన వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట. మగధ సామ్రాజ్యంలోని హర్యంక రాజవంశ రాజు బింబిసారుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా తారక్ ఈ పాత్రను ఎలివేట్ చేస్తూ వాయిస్ ఓవర్ చెబుతున్నాడట.

అయితే ‘బింబిసార’ చిత్రానికి తారక్ వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నట్టు, దీనికి సంబంధించి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ వార్తల్లో ఏ మేరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. కల్యాణ్‌ రామ్‌ మాత్రం తన చిత్రంలో ఎన్టీఆర్‌ భాగం కావాలని అనుకుంటున్నారని, అందుకే తారక్ చేత వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :