ఆ అభిప్రాయానికి ఫులుస్టాప్ పెట్టాలనుకుంటున్న ఎన్టీఆర్

Published on Jan 18, 2020 3:00 am IST

రాజమౌళితో సినిమా అంటే ఏ హీరోకైనా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఖాయం. జక్కన్న ట్రీట్మెంట్ వలన ఆ హీరో క్రేజ్ రెట్టింపు అవుతుంది. కానీ చిక్కంతా ఆ తర్వాతే ఉంటుంది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వదనే టాక్ ఉంది. ఈ ఆభిప్రాయానికి బలాన్ని చేకూర్చే సందర్భాలు అనేకం ఉన్నాయి.

రాజమౌళితో నుండి కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న తర్వాత చాలామంది హీరోల సినిమాలు నిరాశాజనకమైన ఫలితాలుగానే మిగిలిపోయాయి. కానీ ప్రజెంట్ జక్కన్నతో సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న తారక్ ఆ అభిప్రాయాన్ని బద్దలుకొట్టాలనే ఉద్దేశ్యంతో తన నెక్స్ట్ చిత్రాన్ని పకడ్బంధీగా ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ లేదా కొరటలా శివల్లో ఎవరో ఒకరితో తన తర్వాతి చిత్రాన్ని చేయాలనుకుంటున్నారు ఎన్టీఆర్. గతంలో ఈ ఇద్దరు దర్శకులతో ‘అరవిందసమేత, జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More