త్రివిక్రమ్ తో సినిమా ఉంటుటుందట !

Published on May 16, 2021 1:00 am IST

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత తనకు వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ తన తరువాత సినిమాలను చాలా ప్లాన్డ్ గా ఫిక్స్ చేసుకుంటున్నాడు. కొరటాల శివతో చేయనున్న సినిమా పై తారక్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా బాగా ఆసక్తి నెలకొంది. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు.

కాగా ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీ చేయడానికి సన్నాహాలు చేసినా మధ్యలో డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా ఉంటుందని ప్రశాంత్ నీల్ తో సినిమా తరువాత, ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తోందట. ఆ తరువాత మరో టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమా ప్లాన్ లో ఉన్నాడట తారక్. అలాగే సంజయ్ లీలా భన్సాలీతో కూడా తారక్ ఒక సినిమాని కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :