బిగ్ బాస్-2 ఫైనల్ కు గెస్ట్ గా ఎవరు రానున్నారో తెలుసా ?

Published on Sep 19, 2018 8:22 pm IST

నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్ సీజన్ 2’ క్లైమాక్స్ కు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈషో ముగిసిపోనుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ 2 విన్నెర్ ఎవరు అవుతారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక దాంతో పాటు రోజు రోజు కు షో లో వివాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. వున్న 6గురు కంటెస్టెంట్లలో విన్నెర్ ఎవరో తెలియక బిగ్ బాస్ ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. ఇక ఇదిలా ఉంటే ఈషో ఫైనల్ ఎపిసోడ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నారని సమాచారం. ఈషో విన్నర్ ను కూడా ఆయనే ప్రకటించనున్నాడట. అయితే ఈవార్తలను అధికారికంగా ద్రువీకరించాల్సి వుంది.

ఇక బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ను తన భుజాలపై వేసుకొని సూపర్ హిట్ చేశాడు ఎన్టీఆర్. ఈసెకండ్ సీజన్ కు కూడా ఆయనే హోస్ట్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంవల్ల ఆయన ఈషో నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన షో నిర్వాహుకుల విజ్ఞప్తి మేరకు గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :