మరోసారి పోలీస్ ఆఫీసర్ గా ఎన్.టి.ఆర్?

మరోసారి పోలీస్ ఆఫీసర్ గా ఎన్.టి.ఆర్?

Published on May 27, 2014 4:01 PM IST

jr-ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రభస’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. వక్కంతం వంశీ కథని అందిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించనున్నాడు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో ‘బాద్షా’ సినిమాలో కొద్ది సేపు మాత్రమే పోలీస్ గా కనిపించిన ఎన్.టి.ఆర్ మరోసారి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

పూరి జగన్నాధ్ కూడా మొట్ట మొదటి సారి వేరే రైటర్ రాసిన కథతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు