కొరటాలకు అద్భుతంగా విషెస్ తెలిపిన తారక్.!

Published on Jun 15, 2021 11:00 am IST

తన మొదటి సినిమాతోనే దర్శకునిగా సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకొని తర్వాత కూడా అదే పరంపర కొనసాగిస్తూ బ్లాక్ బస్టర్ అనే పదాన్ని మరో ఇంటి పేరులా మార్చేసుకున్న బ్లాక్ బస్టర్ కొరటాల శివ పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు సహా అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన విషెస్ మాత్రం మరింత ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పాలి.

తనకి అత్యంత సన్నిహితుడు కొరటాల ను ఉద్దేశించి “స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని తన వాత్సల్యాన్ని వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ రకంగా అద్భుతంగా తెలియజేసారు.

మరి వీరి కాంబో నుంచి వచ్చిన “జనతా గ్యారేజ్” భారీ హిట్ కావడంతో మళ్ళీ వీరి నుంచి రానున్న మరో చిత్రం చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :