వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఒంటరిగా ఉన్న ఫోటో !

Published on Sep 25, 2018 12:01 pm IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం ప్రస్తుతం ఇటలీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్టీఆర్ మరియు పూజ హెగ్డేల మీద చిత్రబృందం ఓ సాంగ్ ను చిత్రీకరిస్తోంది. అయితే సాంగ్ షూట్ సమయంలో మధ్యలో గ్యాప్ వస్తే.. ఎన్టీఆర్ ఒక్కడే ఓ చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అవుతున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

పై చిత్రం గమనిస్తే.. ఎన్టీఆర్ ఒంటరిగా కూర్చొని.. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇటీవలే తన తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్.. తన జీవితంలో అతిపెద్ద విషాదాన్ని ఎదురుకోవాల్సి వచ్చింది. ఇక అరవింద చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 6న గ్రాండ్ గా జరిపి.. చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదలచెయ్యాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :