రాజమౌళి సినిమా గురించి ఎన్టీఆర్ మాటల్లో !

3rd, April 2018 - 06:36:30 PM

ఐపిఎల్ ప్రెస్ మీట్లో భాగంగా ఎన్టీఆర్ మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి సినిమా గురించి ,మాట్లాడుతూ… రాజమౌళి ఇంతవరుకు తనకు కథ చెప్పలేదని, సినిమా కోసం సిద్దంగా ఉండమని చెప్పినట్లు ఎన్టీఆర్ వెల్లడించాడు. ‘రంగస్థలం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ కూడా ఇదే విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.

దీన్ని బట్టి రాజమౌళి ఇంతవరుకు ఎన్టీఆర్, చరణ్ కు పూర్తి స్క్రిప్ట్ చెప్పలేదని అర్థం అవుతోంది. అంటే జక్కన్న ఇంకా స్క్రిప్టును అందంగా చెక్కే పనిలో ఉన్నారని స్పష్టమవుతోంది. అక్టోబర్ నుండి ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ”ఇద్దరు ఇద్దరే” అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉంది. ఆగష్టు నుండి ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.