‘మహేష్ – రాజమౌళి’ సినిమా పై కొత్త గాసిప్ !

Published on May 9, 2021 8:19 pm IST

రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడని, ఆ మధ్యే జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక అప్పటి నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో రూమర్ ఒకటి ఈ సినిమా గురించి బాగా వినిపిస్తోంది. ఈ చిత్రం అడ్వెంచర్ డ్రామాగా ఉంటుందని, వీఎఫ్‌ఎక్స్, సిజిఐ వర్క్ ఎక్కువుగా ఉంటుందట. ఇప్పుడు, ఫిల్మ్ సర్కిల్స్‌ లో తాజా గాసిప్ ఏమిటంటే, ఈ చిత్రం ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించబడుతుందని ఇప్పటికే రాజమౌళి లొకేషన్స్ పిక్స్ ను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే, ఈ వార్తకు సంబంధించి ఇంకా ధృవీకరణ లేనప్పటికీ, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాదికి గాని మొదలు కాదని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో ఫుల్ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :