‘ఎన్టీఆర్’ సినిమా కోసం ప్రశాంత్ నీల్ సంచలన నిర్ణయం ?

‘ఎన్టీఆర్’ సినిమా కోసం ప్రశాంత్ నీల్ సంచలన నిర్ణయం ?

Published on Nov 15, 2022 3:01 AM IST

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టి మొత్తం ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా పైనే ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ కి ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. పైగా ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా పై తారక్ ఫాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు నీల్ ప్లాన్ చేస్తున్నాడట.

ఎన్టీఆర్ తల్లి షాలిని గారు కర్నాటకకు చెందిన వారు. పైగా ఎన్టీఆర్‌కు కన్నడ భాష బాగా తెలుసు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రూపొందించి కన్నడ భాషలో డబ్బింగ్ చేయడం కంటే.. డైరెక్ట్ కన్నడ చిత్రంగానే ఈ చిత్రాన్ని నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు