టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర స్టార్ బ్యూటీ సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాకు మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఆదివారానికి రూ.40 కోట్లు దాటిన ఈ చిత్రం, సోమవారం నాటికి రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరి కొత్త మైలురాళ్లను అందుకుంటోంది. థియేటర్లలో పోటీ లేకపోవడంతో సమంతకు వచ్చే వీకెండ్ కూడా బాగా కలిసి రానుంది.
దీనికి కారణం జూన్ 26న రావాల్సిన ‘లెనిన్’ జూలై 10కి వాయిదా పడటమే. ఈ ఖాళీ స్లాట్‌ను భర్తీ చేయడానికి రీ-రిలీజ్ చిత్రాలు థియేటర్లపై పడుతున్నాయి. మహేష్ బాబు ‘ఒక్కడు’, మంచు విష్ణు ‘కన్నప్ప’, కొత్త హంగులతో ‘హనుమాన్ 3డి’, రాజ్ తరుణ్ ‘సినిమా చూపిస్త మావా’ జూన్ చివరి వారంలో రీ-రిలీజ్ కానున్నాయి. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ కూడా రీ-రిలీజ్ కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికి ఆ సినిమా రావడం లేదు.
అయితే, ఇలా ఒకేసారి పాత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల వచ్చిన ‘గౌతమ్ నంద’, ‘కృష్ణ’, ‘ఊసరవెల్లి’ చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ రీ-రిలీజ్ హడావుడి వల్ల జనాల్లో ఉన్న కాస్త ఆసక్తి కూడా తగ్గేలా ఉంది. ఏదేమైనా, 2026 మొదటి ఆరు నెలల చివరి వారం ప్రేక్షకులకు కేవలం రీ-రిలీజ్‌లతోనే సర్దుకుపోవాల్సి వస్తుంది.


