స్పెక్యులేషన్స్ తోనే సెన్సేషన్ చేస్తున్న చరణ్ ప్రాజెక్ట్.!

Published on Feb 11, 2021 7:00 am IST

మన టాలీవుడ్ లో మాంచి మాస్ క్రౌడ్ పుల్లింగ్ స్టార్ హీరోలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. భారీ ఓపెనింగ్స్ రాబట్టగలిగే ఈ ‘మిస్టర్ బాక్సాఫీస్’ ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. సరే ఇది బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం చరణ్ నెక్స్ట్ ఎవరితో ఉంటుంది అన్న అంశం ఓ రేంజ్ లో సెన్సేషన్ అవుతుంది.

చరణ్ లైన్ లో పాన్ ఇండియన్ సంచలన దర్శకుడు శంకర్ కూడా ఉన్నారని అతనితో చరణ్ సినిమా ఫిక్స అయ్యిపోయింది అన్న స్పెక్యులేషన్ సోషల్ మీడియాలో సెన్సేషనే నమోదు చేసింది. ఎక్కడ చూసినా సరే ఈ కాంబో కోసమే ఒక్కసారిగా హాట్ టాపిక్ ఊపందుకుంది. మరి నిజంగానే ఈ కాంబో ఉందో లేదో కానీ జస్ట్ టాక్ కే రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. మరి నిజంగా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే ఆ ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More