జస్ట్ లో మిస్సయిన తెలుగు సినిమా భారీ విజువల్ ట్రీట్.!

Published on Oct 25, 2020 6:21 pm IST

మన టాలీవుడ్ నుంచి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పాన్ ఇండియన్ చిత్రాల హవా మొదలయ్యింది. అయితే ఇప్పుడు వాటిలో రెండు భారీ చిత్రాలకు సంబంధించి కేవలం అతి తక్కువ వ్యవధిలోనే మామూలు ట్రీట్ ఉండేలా లేదని చెప్పాలి.

ఒకటి తెలుగు మార్కెట్ ను పాన్ ఇండియన్ లెవెల్లో మరో స్థాయికి తీసుకెళ్లిన హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం “రాధే శ్యామ్” అయితే మరొకటి అదే ప్రభాస్ ను పాన్ ఇండియన్ మార్కెట్ కు పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “RRR” చిత్రం.

ఈ భారీ పీరియాడిక్ అండ్ మల్టీ స్టారర్ చిత్రంతో తారక్ కూడా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఇపుడు ఈ రెండు సినిమాల టీజర్స్ విషయంలో ఆ మధ్య అంతా మంచి హైప్ నెలకొంది.

కొమరం భీం గా తారక్ టీజర్ ఈ అక్టోబర్ 22న విడుదలయ్యి పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ విజువల్ ట్రీట్ ను అందించింది. ఈ టీజర్ లో కొన్ని షాట్స్ అయితే మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం చేసుకుంది. ఇదే సమయంలో కానీ ఆ తర్వాత రాధే శ్యామ్ టీజర్ కూడా వచ్చి ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉండేది.

ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నవే కావడం అలాగే విజువల్ పరంగా కూడా అత్యున్నత ప్రామాణికాలతో తెరకెక్కిస్తుండడంతో కేవలం ఒక్క రోజు గ్యాప్ లో ఇండియన్ సినిమా మరోసారి ఈ రెండు తెలుగు సినిమా విజువల్ ట్రీట్ ను విట్నెస్ చేసి ఉండేవి.

రెండూ పీరియాడిక్ సినిమాలే పైగా ఒకదానికి ఒకటి పూర్తి భిన్నమైన సబ్జెక్టులు కావడంతో కేవలం ఒక్కరోజు విరామంలో ఈ రెండు టీజర్స్ పడి ఉంటే రెండు రకాల అనుభూతులు మనవాళ్ళు రుచి చూసి ఉండేవారు కానీ రాధే శ్యామ్ టీం నుంచి జస్ట్ మోషన్ పోస్టర్ మాత్రమే రావడంతో ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ జస్ట్ లో మిస్సయ్యింది.

సంబంధిత సమాచారం :

More