‘జ్యోతి లక్ష్మీ’.. ఏంటా ఫాస్ట్.!

‘జ్యోతి లక్ష్మీ’.. ఏంటా ఫాస్ట్.!

Published on Apr 14, 2015 3:50 PM IST

Jyothilakshmi
ఇప్పటి వరకూ ఎంతో మంది స్టార్ హీరోలని పవర్ఫుల్ గా చూపిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మొదటి సారి చేస్తున్న లేడీ ఓరియెంతెడ్ ఫిల్మ్ ‘జ్యోతి లక్ష్మీ’. చార్మింగ్ గర్ల్ ఛార్మీ టైటిల్ పాత్రలో కనిపించనుంది. మామూలుగా పూరి జగన్నాధ్ కి సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాడు అనే పేరుంది. కానీ ఈ సారి కేవలం 50-60 రోజుల్లో జ్యోతి లక్ష్మీ షూటింగ్ ని ఫినిష్ చేసాడు. విషయంలోకి వెళితే.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది ఫిబ్రవరి 20న, రెగ్యులర్ షూటింగ్ మొదలైంది, మార్చి మొదటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది, ఏప్రిల్ చివరికల్లా పూర్తైపోతోంది.

గత కొద్ది నెల రోజులుగా ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. నేటితో గోవా షెడ్యూల్ పూర్తయ్యింది. ఇక కేవలం ఒక వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. గోవా నుంచి హైదరాబాద్ రాగానే ఈ వారం రోజుల షెడ్యూల్ ని కూడా త్వరగా ఫినిష్ చేసి మేలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర టీం గోవా నుంచి తిరిగి రాగానే ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనున్నారు. ‘గోవా షెడ్యూల్ పూర్తయ్యింది. ఒక వారం షెడ్యూల్ మాత్రమే బాలన్స్ ఉంది. త్వరలోనే రిలీజ్ చేస్తాం’ అని ఛార్మీ ట్వీట్ చేసింది. హీరోలలానే పూరి ఈ సినిమాలో ఛార్మీని కూడా బాగా పవర్ఫుల్ గా చూపించనున్నాడని సమాచారం.

చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. సికె ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు