ఇప్పటి వరకూ ఎంతో మంది స్టార్ హీరోతో సినిమాలు చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మొదటి సారి చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘జ్యోతి లక్ష్మీ’. చార్మింగ్ గర్ల్ ఛార్మీ టైటిల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ ని పూరి జగన్నాధ్ చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది ఫిబ్రవరి 20న, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది, రేపటితో అనగా ఏప్రిల్ 29తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. రేపటితో అన్ని సీన్స్ ని ఫినిష్ చేసి గుమ్మడి కాయ కొట్టేయనున్నారు.
ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని గోవాలో షూట్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేసి మేలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. సికె ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.


