‘కె.ఏ పాల్’ సినిమాలో ట్రంప్ ?

Published on Jul 10, 2019 7:14 pm IST

గత కొద్దీ రోజుల నుండి మీడియాలో కె.ఏ పాల్ బయోపిక్ మీద న్యూస్ హల్ చల్ చేస్తుంది. పాల్ పాత్రలో సునీల్ నటించబోతున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాలో ట్రంప్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యకుడు ట్రంప్ లాగే పోలికలు వుండే ఆర్టిస్ట్ ని గుర్తించారట. సునీల్ ప్రస్తుతం అమెరికా లో ఉన్నట్టు సమాచారం. మెక్ ఓవర్ కోసం సునీల్ హాలీవుడ్ మేకప్ మెన్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నార్త్ కొరియా అధ్యకుడు కిమ్ జామ్ ఉన్, హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలీనా జోలీ లాగా వుండే ఆర్టిస్ట్ లు కూడా నటిస్తున్నట్టు తాజా సమాచారం.

పొలిటిక‌ల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకి కొత్త డైరెక్ట‌ర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏమైనా కే.ఏ.పాల్.. తన వింత చేష్టలతో తన పొంతన లేని మాటలతో పిచ్చి చూపులతో ఓ రేంజ్ కామెడీని పండిస్తూ సోషల్ మీడియాలో మొన్నటివరకూ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More