కృష్ణా జిల్లాలో రజనీ హవా ఎలా ఉందో చూడండి !

కృష్ణా జిల్లాలో రజనీ హవా ఎలా ఉందో చూడండి !

Published on Jun 9, 2018 11:52 AM IST

సూపర్ స్టార్ రజనీ నటించిన ‘కాలా’ చిత్రం గురువారం విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తమిళనాడులో అయితే అభిమానులు చిత్రాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమా డీసెంట్ షేర్ రాబడుతోంది. ట్రేడ్ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు ఈ చిత్రం కృష్ణా జిల్లలో శుక్రవారం రూ. 8,09,532 షేర్ ను వసూలు చేసింది.

దీంతో రెండు రోజులకు కలిపి రూ.34,18,279 షేర్ ను ఖాతాలో వేసుకుంది. వీకెండ్ కావడం, వేరే కొత్త తెలుగు సినిమాలేవీ విడుదలకాకపోవడంతో ఈ వసూళ్లు స్టడీగానే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక యూఎస్లో సైతం ఈ చిత్రం మిలియన్ డాలర్ ను అందుకోంది. రాజకీయ ఆరంగేట్రం తర్వాత రజనీ నుండి వచ్చిన తోలి చిత్రం కావడంతో ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు