దేశ వ్యాప్తంగా మొదలైన కాలా మానియా!
Published on Jun 7, 2018 9:20 am IST

రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆ హంగామా మాములుగా ఉండదు. అయన నటించిన కాలా చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైయింది. దింతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి మాములుగా లేదు. ఇక తమిళనాడులో అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా విడుదల సందర్బంగా ఈ రోజు ఉద్యోగులకి అక్కడ సెలవు ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా థియేటర్ బయట బ్యానర్లు, కటవుట్లు రజిని ఫోటలకు పాలాభిషేకం సరేసరి.

ఈ ఒక్క సినిమా అని కాదు రజిని కాంత్ నటించిన సినిమాలు విడుదలవుతుందంటే చాలు పండుగ వాతావరణం కనిపిస్తుంది . బహుశా ఇండియాలో ఇది ఒక్క రజిని కి మాత్రమే సాధ్యమేమో . కాలా ఇప్పటికే ప్రీమియర్ షోల ద్వారా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ లెక్కన ఈ చిత్రం అంతటా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంటే రికార్డ్స్ తిరగరాయడం ఖాయం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook