సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న చిత్రాల్లో ‘కాలా’ కూడా ఒకటి. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 27న విడుదలచేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. కానీ ప్రస్తుతం తమిళనాట జరుగుతున్న నిర్మాతల మండలి నిరసన కారణంగా సినిమా కాస్త వాయిదాపడ్డట్టు తెలుస్తోంది.
అలాగే చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. కానీ ఈ విషయంపై ఇంకా చిత్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ముంబైలోని ధారవి బ్యాక్ డ్రాప్లో జరిగే ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు ధనుష్ స్వయంగా నిర్మించారు.


