ఇంట్రెస్టింగ్ లొకేషన్ లో షూటింగ్ జరుపుకుంటున్న కాప్పాన్ !

Published on Apr 25, 2019 11:42 am IST

వరస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు స్టార్ హీరో సూర్య. అందులో భాగంగా ఇటివల యెన్ జి కె షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన ప్రస్తుతం ‘కాప్పాన్ ,సురరై పోట్రు’ చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిలో కాప్పాన్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ జావా ఐస్ ల్యాండ్ లో జరుగుతుంది. అక్కడ సూర్య , సయేశా ఫై ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలకానుంది. కెవి ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇక సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కుతున్న సురరై పోట్రు ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది. ఇక ఈ సినిమా తరువాత సూర్య స్టార్ డైరెక్టర్ శివ తో సినిమా చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :