కార్తి కెరీర్లో అతి పెద్ద తెలుగు రిలీజ్ ‘కాష్మోరా’
Published on Oct 27, 2016 9:41 am IST

Kashmoraa
ప్రస్తుతం ఈ వారాంతంలో విడుదలవుతున్న సినిమాల్లో తమిళ హీరో కార్తి నటించిన ‘కాష్మోరా’ చిత్రం కూడా ఒకటి. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది ఈ చిత్రం. చిత్ర టీమ్ చేపట్టిన ప్రమోషన్లు, విడుదల చేసిన ట్రైలర్ల కారణంగా తమిళంలోనే గాక తెలుగులో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. సుమారు రూ. 55 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన సినిమా కావడం, ‘ఊపిరి, ఆవారా’ వంటి సినిమాలతో కార్తితెలుగులో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవడం వంటి కారాణాల వలన తెలుగులో సైతం భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేశారు తెలుగు సమర్పకులు పివిపి.

ఈ చిత్రం ఏపి, తెలంగాణాల్లో మొత్తం 600 థియేటర్లలో విడుదలకానుంది. రజనీకాంత్ మినహా మిగతా తమిళ స్టార్ హీరోలకు కూడా కష్టసాధ్యమైన ఇంత పెద్ద తెలుగు రిలీజ్ కార్తి సాధించడం విశేషమని చెప్పాలి. అలాగే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2000 థియేటర్లలో విడుదలకానుంది. దర్శకుడు గోకుల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తి మూడు పాత్రల్లో కనిపించనుండగా వాటిలో అతి ముఖ్యమైన రాజ్ నాయక్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలవనుంది. అలాగే సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రేక్షకులకు కనువిందు చేసే విధంగా ఉంటాయని తెలుస్తోంది.

 
Like us on Facebook