
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డా రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ అనే టైటిల్ తో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో నటించే నటీనటులును ముఖ్యంగా హీరోయిన్ని వెతికే పనిలో ఉంది చిత్రబృందం. తాజాగా కబాలిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తెగా నటించిన సాయి ధన్సిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందట. ఈ చిత్ర నిర్మాతలు కూడా ఆమెను సంప్రదించారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
త్వరలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రంలోని మిగిలిన తారాగణంతో పాటుగా సాంకేతిక విభాగాన్ని కూడా ఖరారు చేయబోతున్నారు. గరుడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజశేఖర్ నటిస్తుండటం, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. సి. కళ్యాణ్ మరియు రాజశేఖర్ కుమార్తెలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.