గల్ఫ్ లోనూ సత్తా చాటుతున్న ‘కబాలి’

kabali1
సౌత్ ఇండియా సూపర్ స్టార్ ‘రజనీకాంత్’ నటించిన ‘కబాలి’ చిత్రం రికార్డుల ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. ఒక్క ఇండియాలోనే గాక విడుదలైన ప్రతి దేశంలోనూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ లో విడుదలైన కబాలి మొదటి వారం టాప్ 10 సినిమాల లిస్టులో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంజ్యురింగ్ 2, స్టార్ ట్రెక్ బెవైండ్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వంటి హాలీవుడ్ సినిమాలు, సుల్తాన్, మదారి వంటి బాలీవుడ్ సినిమాలు వరుసలో ఉన్నప్పటికీ కబాలి వాటన్నింటినీ వెనక్కు నెట్టి మొదటి స్థానంలో నిలబడటం నిజంగా విశేషమే.

యూఏఈ లో కబాలి కి మొదటి వారంలో 400 షోలు ప్రదర్శింపబడ్డాయి. ఈ షోలకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దాదాపు 38,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ స్థాయి ఓపెనింగ్స్ మారే సౌత్ ఇండియన్ సినిమాకు రాలేదు. విడుదలైన రోజు నుండి టాక్ పరంగా యావరేజ్ అన్నప్పటికే కలెక్షన్ల విషయంలో మాత్రం కబాలి సునామి ఇంకా తగ్గలేదు. కలైపులి థాను నిర్మాణంలో పా. రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా మలేషియా నైపథ్యంలో సాగే ఓ గ్యాంగ్ స్టర్ కథగా రూపుదిద్దుకుంది.