గత కొంత కాలంగా వరుస పరాజయాలతో కొనసాగుతున్న స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘కదరం కొండన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘డోంట్ బ్రీత్’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజేష్ ఎమ్ సెల్వ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం యొక్క షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక తాజాగా ఈ చిత్రంలోని సెకండ్ లుక్ పోస్టర్ ను విడుదలచేశారు. ఈ పోస్టర్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో విక్రమ్ చాలా స్టైలిష్ గా వున్నాడు. ఈ పోస్టర్ విక్రమ్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈచిత్రం యొక్క టీజర్ ను వచ్చే ఏడాది జనవరి 15న విడుదలచేయనున్నారు. మరి ఈ సినిమాతోనైనా విక్రమ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.


