‘మహానటుడు ఎన్టీఆర్’ సినిమాలో మరో మహానటుడు !

Published on Jul 26, 2018 8:35 am IST

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధానపాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి విశ్వ విఖ్యాత నటరత్నఎన్టీఆర్ జీవితం కథ చిత్రంగా నిర్మిస్తున్నారు. జూలై 5 నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకొని మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబులతో అతిధి పాత్రల్లో మరికొంతమంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో మరో మహానటుడు నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ నటిస్తున్నారు. ఎలాంటి పాత్రకైనా జీవం పోసే గొప్ప నటుడు ఆయన. ఎన్టీఆర్ గారితో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇప్పుడు తెలుగు చిత్ర పితామహుడైన హెచ్.ఎమ్‌.రెడ్డి పాత్రలో కైకాల నటిస్తుండటం నిజంగా విశేషమే.

ఐతే బుధవారం కైకాల సత్యనారాయణగారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చిత్రంలోని ఆయన లుక్‌ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :