ఇంటర్వ్యూ : ‘కాజల్ అగర్వాల్’ – ‘సీత’ ఈ తరం అమ్మాయిలకు ప్రతిరూపం !

Published on May 19, 2019 5:20 pm IST

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా రాబోతున్న సినిమా ‘సీత’. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

ముందుగా, కలియుగ ‘సీత’ ఎలా ఉండబోతుంది ?

తను మోటివేటెడ్. తన డ్రీమ్స్, తన గోల్స్ ను తను ఎలాగైనా సాధించుకోవాలనే పట్టుదలతో ఫోకస్డ్ గా ఉంటుంది. అయితే తన గోల్స్ ను, డ్రీమ్స్ ను సాధించుకునే క్రమంలో తానేం చేసింది అనేది సినిమాలో చూడండి. ఈ సినిమాలో నన్ను చూసి కొంచెం కొత్తగా ఫీల్ అవుతారు. ఇప్పటి వరికైతే నేను ఇలాంటి కారెక్టర్ ను చెయ్యలేదు.

 

తేజగారిలో కొత్తగా వచ్చిన మార్పులు ఏమిటి ?

చాలా మార్పులు వచ్చాయి. యూనిట్ నుంచి వర్క్ రాబట్టుకోవడంలో ఆయన కమాండ్ చేసే విధానం మారింది. అలాగే యాక్షన్ – కట్ కి మధ్యలో ఆయన మెడిటేషన్ చేస్తున్నంతగా షాట్ లో లీనం అయిపోతున్నారు. ఇరవై నాలుగు గంటలు పని చెయ్యగలిగేంత హార్డ్ వర్క్, ఎనర్జీ మెయింటైన్ చెయ్యడం. తేజగారితో పని చెయ్యడం వల్ల చాలా నేర్చుకోవచ్చు.

 

ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు చూస్తుంటే మీది కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న రోల్ లా అనిపిస్తోంది ?

దీని గురించే చాలామంది అడుగుతున్నారు. సినిమా చూస్తే నా క్యారెక్టర్ ఎందుకు అలా ఉందనేది అర్ధమవుతుంది. సినిమా ‘సీత’ పాత్ర చుట్టే తిరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆ పాత్ర ఏ స్థాయిలో ఉండాలి. కరెక్ట్ గా ఆ స్థాయిలోనే ‘సీత’ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ప్రకారమే సీత బిహేవ్ చేస్తోంది.

 

ఈ సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి చెప్పండి ?

ఇది నాకు తనతో సెకెండ్ ఫిల్మ్. తన పాత్రలో తాను అద్భుతంగా నటించాడు. ఎందుకంటే తన క్యారెక్టర్ కూడా రెగ్యులర్ గా ఉండదు. ముందుగా ఆ క్యారెక్టరైజేషన్ని అర్ధం చేసుకోవడం.. అందుకు తగ్గట్లు సిచ్యుయేషన్ పరంగా యాక్ట్ చెయ్యడం చాలా కష్టం. నిజంగా శ్రీనివాస్ చాలా బాగా చేశారు. తనతో మళ్లీ కలిసి పని చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది.

 

ఈ సినిమా షూటింగ్ క్రమంలో హీరోని బాగా టీజ్ చేశారట.. అదేవిధంగా డామినేట్ కూడా చేశారట.. నిజమేనా ?

అయ్యో (నవ్వుతూ) నేనేం టీజ్ చెయ్యలేదండి.. అయినా డామినేట్ చేశానని ఎవరు చెప్పారు. అసలు ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టిస్తారు. నేనెప్పుడూ ఎవర్ని టీజ్ చెయ్యలేదండి. అబ్జర్వ్ చేస్తాను. కావాలంటే షూట్ లో తేజగారు ఉన్నారుగా.. అడగండి.

 

ఈ సినిమాలో అంతర్లీనంగా మెసేజ్ ఏమైనా ఉంటుందా ?

సోషల్ మెసేజ్ అయితే సినిమాలో టచ్ చెయ్యలేదు. కాకపోతే ప్రతి వ్యక్తికి ఎవరికీ వారికీ పర్సనల్ డెవలప్ మెంట్ కి సంబంధించి మెసేజ్ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ కి సంబంధించి మంచి మెసేజ్ ఉంటుంది.

 

ఇటు శ్రీనివాస్ లాంటి యంగ్ హీరోస్ తో యాక్ట్ చేస్తున్నారు ? అటు మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోలతో యాక్ట్ చేస్తున్నారు ? ఎలా అనిపిస్తోంది ?

ఎప్పటిలాగే మామూలుగానే అనిపిస్తోందండీ (నవ్వుతూ). కాకపాతే మెగాస్టార్ గారితో కలిసి పని చేయడం అదొక గ్రేట్ ఫీలింగ్. అలాగే యంగ్ హీరోస్ తో కలిసి చెయ్యడం కూడా మంచి ఎక్స్ పీరియన్స్.

 

‘ఇండియన్ 2’లో హీరోయిన్ గా నటిస్తున్నారు కదా. ఆ సినిమా ఆగిపోయిందని రూమర్స్ వచ్చాయి ? ఆ సినిమా పరిస్థితి ఏమిటి ?

సినిమా ఏమి ఆగిపోలేదు. కమల్ సర్ బిజీగా ఉండటం వల్ల షూట్ మధ్యలో బ్రేక్ వచ్చింది. త్వరలోనే ‘ఇండియన్ 2’ షూట్ మళ్లీ మొదలవుతుంది. ఆ సినిమా కోసం నేను కూడా చాలా ఇంట్రస్టింగ్ గానే వెయిట్ చేస్తున్నాను.

 

ఈ సినిమాకి ‘సీత’ అని టైటిల్ పెట్టడానికి కారణం ?

కారణం అంటే.. (నవ్వుతూ) ‘సీతే’ కారణం. ఎందుకంటే ఈ కథ.. సీత జీవితంలో జరిగిన సంఘటనలు క్రమమే. సీత ఈ తరం చాలామంది అమ్మాయిలకు ప్రతిరూపం లాంటిది.

 

మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ?

శర్వానంద్ తో ఓ మూవీ జరుగుతుంది. ఇప్పటికే షూట్ కూడా ఆయిపోయింది. అలాగే జయం రవితో చేస్తోన్న మూవీ కూడా షూటింగ్ పూర్తి అయింది. ఇక ‘ఇండియన్ 2’ అలాగే తమిళంలో మరో సినిమా, తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More