బర్త్ డే బేబీ కాజల్ “రణరంగం” ఫస్ట్ లుక్

Published on Jun 19, 2019 10:57 am IST

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ జన్మదినం నేడు. దీన్ని పురస్కరించుకొని “రణరంగం” చిత్ర బృందం విషెస్ చూవుతూ మూవీలోని ఆమె లుక్ ని విడుదల చేశారు.శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న “రణరంగం” మూవీలో హీరోయిన్ గా కాజల్ చేస్తున్న విషయం తెలిసిందే. బీచ్ లో ఓసాంగ్ కొరకు ఆడిపాడుతున్నట్లున్న కాజల్ పోజ్ ఎక్సయిటింగ్ గా ఉంది. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ గ్యాంగ్ స్టర్ లుక్ తో మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తున్న నేపథ్యంలో నేడు విడుదలైన కాజల్ లుక్ ఆసక్తిని రేపుతోంది. ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రం శర్వానంద్ కి జరిగిన ప్రమాదం వలన ఆలస్యం అయ్యేఅవకాశము కలదు.

ఇక కాజల్ తేజ దర్శకతంలో వచ్చిన కళ్యాణ్ రామ్ “లక్ష్మీ కళ్యాణం” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. దర్శకుడు రాజమౌళి తీసిన “మగధీర” చిత్రంలో మిత్రవింద పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అందరు టాప్ స్టార్స్ తో నటించిన కాజల్ కొన్నాళ్లు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం ఆమె హిందీ చిత్రం “క్వీన్” రీమేక్ తో పాటు, జయం రవి హీరోగా వస్తున్న తమిళ చిత్రం “కోమలి” మూవీలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More