భర్త మూలంగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నానన్న కాజల్

Published on May 20, 2021 1:30 am IST

స్టార్ హీరోయిన్లుగా వెలుగుతుండగానే వివాహం చేసుకుని సినిమాలకి గుడ్ బై చెప్పిన నటీమణులు చాలామందే ఉన్నారు. కెరీర్ అర్థాంతరంగా ఆగిపోతుందని పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేసే హీరోయిన్లు అనేకమంది. దాదాపు 80 శాతం మంది పెళ్ళైన వెంటనే ఇష్టం లేకపోయినా సినిమాలు మానేశారు. అతికొద్దిమంది మాత్రమే పెళ్లి తర్వాత కూడ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. వారిలో కాజల్ అగర్వాల్ కూడ ఉంది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లాడిన కాజల్ సినిమాలను మాత్రం వదిలేది లేదని అప్పుడే అంది.

ఆ ప్రకారమే చేస్తోంది ఆమె. వరుసగా కొత్త సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రజెంట్ కాజల్ చేతిలో ‘ఇండియన్-2’, మెగాస్టార్ చిరు ‘ఆచార్య’, నాగార్జున కొత్త చిత్రం ఉన్నాయి. వీటితోపాటు ఒక తమిళ చిత్రం కూడ ఉంది. అలాగే వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ కూడ ఉన్నాయి. వీటిలో సగం ప్రాజెక్ట్స్ పెళ్ళైన తర్వాతనే సైన్ చేసింది కాజల్. ఇలా పెళ్లయ్యాక కూడ తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాలు చేసుకోవడం వెనుక భర్త గౌతమ్ కిచ్లు సహకారం చాలా ఉందని అంటోంది కాజల్. ఎక్కువ సినిమాలు చేయమని గౌతమ్ ప్రోత్సహిస్తుంటాడని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :