నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘NBK111’. వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై, ఇటీవల విడుదలైన బాలకృష్ణ బర్త్‌డే గ్లింప్స్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
తాజాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పుడూ గ్లామరస్ పాత్రల్లో కనిపించే కాజల్‌ను ఈసారి డైరెక్టర్ గోపీచంద్ మలినేని చాలా విభిన్నంగా, ఒక పవర్‌ఫుల్ డీగ్లామ్ లుక్‌లో ప్రెజెంట్ చేశాడు. ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో ఆమె క్యారెక్టర్ చాలా ఇంటెన్సివ్‌గా, యూనిక్‌గా ఉండబోతోందని ఈ లుక్ చూస్తేనే అర్థమవుతోంది.
మరో విశేషం ఏంటంటే, ఈ చిత్రంలో మంచు మనోజ్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్స్, గ్రాండ్ విజువల్స్ మరియు థమన్ అందించే హై-ఆక్టేన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది.


