కాజల్ మళ్లీ హడావుడి చేస్తోంది

Published on Jun 14, 2021 8:34 pm IST

తెలుగు స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడ ఒకరు. లాంగెస్ట్ కెరీర్ కలిగిన తక్కువమంది హీరోయిన్లలో కాజల్ కూడ ఉన్నారు. పెళ్ళైన తరువాత చాలామంది హీరోయిన్లు సినిమాలకి దూరమవుతారు. కానీ కాజల్ మాత్రం ఇంతకుముందులానే సినిమాలు చేస్తోంది. ప్రస్తుతానికి ఆమె చేతిలో మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెగస్టార్ చిరంజీవి ‘ఆచార్య’తో పాటు తమిళ సినిమాలు చేస్తోంది కాజల్. పెళ్లి తర్వాత సినిమాలు చేయాలనే ఆసక్తి ఉన్నా అవకాశాలు వాటికవే తగ్గుముఖం పట్టడం కామన్. కాజల్ విషయంలో కూడ అదే జరుగుతోంది.

ఇదివరకటిలా స్టార్ హీరోల సినిమాలకు ఆమె పేరును పెద్దగా కన్పిడర్ చేయట్లేదు మేకర్స్. దీంతో కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో సందడి పెంచింది. వరుస ఫోటోషూట్లతో హడావుడి చేస్తోంది. తనలో పాత కాజల్ ఇంకా అలానే ఉందని చెబుతూ రకరకాల ఫోటోషూట్స్ చేసి తరచూ సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను అప్లోడ్ చేస్తోంది. అసలే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఆ ఫోటోషూట్లు బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అంతా 36 ఏళ్ల వయసులో కూడ యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని కితాబిస్తున్నారు. కాజల్ కు కావాల్సింది కూడ అలాంటి ఫీడ్ బ్యాకే మరి.

సంబంధిత సమాచారం :