స్టార్ హీరోకి సెకెండ్ హీరోయిన్ గా కాజల్ !

Published on Aug 10, 2020 7:00 am IST

కాజల్ అగర్వాల్ ఇప్పటికే ‘ముంబై సాగా, ఇండియన్ 2’ చిత్రాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో కూడా నటిస్తోంది. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వెళ్ళింది. ఇలయదళపతి విజయ్ – మురుగదాస్ దర్శకత్వంలో రానున్న సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకునట్లు తెలుస్తోంది. కాకపోతే సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ అట. కానీ హీరోయిన్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఉంటుందట.

విజయ్ – మురగదాస్ కలయికలో వచ్చిన ‘తుపాకి’ లో కూడా హీరోయిన్ కాజలే. ఆ సినిమాలో కాజల్ పాత్రకు మంచి అప్లాజ్ లభించింది. అందుకే ఈసారి కూడా ఆమెనే రిపీట్ చేయాలని మురుగదాస్ భావించాడు. కరోనా అనంతరం జరగబోయే షెడ్యుల్ లో కాజల్ కూడా షూట్ లో పాల్గొంటుందట. దీన్నిబట్టి ప్రస్తుతం త్వరలోనే అఫీషియల్ క్కన్ఫర్మేషన్ రావొచ్చు. ఇకపోతే కాజల్, విజయ్ గతంలో ‘మెర్సల్, జిల్లా’ చిత్రాల్లో కూడా కలిసి నటించారు.

సంబంధిత సమాచారం :

More